ప్రపంచానికి పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

India-Pakistan: భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి(Defence Minister) ఖవాజా ఆసిఫ్(Khawaza Asif) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తమ దేశంపై భారత్ దాడి చేస్తే, తమ అస్థిత్వం దెబ్బతినే పరిస్థితి వస్తే ప్రపంచంలో ఏ దేశం మిగలదన్నారు. పాకిస్థాన్ దగ్గర అవసరమైనంత అణు సంపద ఉందని.. అన్ని దేశాలపై అణు దాడి(Nuclear Attack) తప్పకుండా చేస్తామని హెచ్చరించారు.
ఆ దేశ ప్రభుత్వ ఛానల్ సమ టీవీ(Sama TV) చర్చలో పాల్గొన్న ఖవాజా ఆసిఫ్.. ఈ యుద్ధం ప్రారంభమైతే పాకిస్థాన్ ఉండదు, మాతోపాటూ ఏ దేశమూ ఇక్కడ ఉండకుండా చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే ఓ సభలో ప్రసంగిస్తూ భారత్ కు బుద్ధి చెబుతామంటూ వ్యాఖ్యలు చేసిన ఖవాజా, గంట తర్వాత మాట మార్చి నేనలా అనలేదన్నారు. ఆ తర్వాతి రోజే ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు గల్ఫ్ దేశాలు, తుర్కియే, చైనా(China) దేశాలు ఇప్పటికే తమకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయని, మాపై దాడి చేస్తే భారత్కు తీవ్ర నష్టం కచ్చితంగా కలిగి తీరుతుందన్నారు. కశ్మీర్ ను సాధించుకుని తీరుతామని ఆ ఇంటర్వ్యూలో ఖవాజా చెప్పుకు రావడం గమనార్హం.