
అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది మెగా కుటుంబం. త్వరలోనే తమ కుటుంబంలోకి మరో వారసులు రాబోతున్నారని ప్రకటించింది. మెగా హీరో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ వార్తను స్వయంగా లావణ్య తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఓ అందమైన జీవితానికి ప్రారంభం చెప్పబోతున్నామంటూ చిన్నారి చెప్పులను ఇద్దరూ పట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో మెగా కుటుంబానికి మరో పండగ రాబోతోందంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.
గత రెండేళ్లుగా వరస సెలబ్రేషన్స్‌తో మెగా ఫ్యాన్స్ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్(RRR) హిట్‌తో గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ నిలవడం, ఆస్కార్(Oscar) అవార్డుతో మొదలైన సంబరాలు మధ్యలో ఏపీలో 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన(Janasena) విజయం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్(Pawan kalyan) బాధ్యతలు, చిరంజీవి(Chiranjeevi)కి పద్మభూషణ్.. ఇలా ఒకటి వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో వార్త తోడైంది.

చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య 2023 నవంబరు 1న ఇరు కుటంబాల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ సినీ తారలు హాజరయ్యారు.