
Nizamabad:భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్(Pakistan, Bangladesh) నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు, రోహింగ్యాలు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారని మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. దానికి బలం చేకూర్చుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లోనే అత్యధిక బంగ్లాదేశీలు ఉన్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind Dharmapuri) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందూరు పసుపు కార్యక్రమంలో మాట్లాడిన అర్వింద్.. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బోధన్‌లో అత్యధిక దొంగ పాస్‌పోర్టులు ఉన్నాయని.. అత్యధిక బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసలున్నాయని చెప్పుకొచ్చారు. ఒకే ఇంటి నుంచి 41 దొంగ పాస్‌పోర్టులు దొరికాయని.. ఈ నియోజకవర్గం నాదని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు.
అయితే, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చెప్పిన బోధన్ నియోజకవర్గంలో ఎక్కువ ముస్లిం సామాజిక వర్గం జనాభా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ 2014 నుంచి 2023 దాకా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు.