Delhi: గత మూడేళ్లలో యూట్యూబ్ వేధికగా వివిధ కంటెంట్లను రూపొందించి మన భారతీయులు సంపాధించిందెంతో తెలుసా..? అక్షరాలా రూ.21వేల కోట్లు. అవును, నిజమే. ప్రపంచంలోనే ఇది అత్యధికం. కేవలం భారతీయుల కంటెంట్‌ను గతేడాది విదేశీయులు 4500 కోట్ల గంటల పాటు చూశారట. ఈ విషయాల్ని సంస్థ సీఈసీ నీల్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఏడాది కేవలం భారత్‌లోనే ఆర్టిస్టులు, మీడియా సంస్థల అభివృద్ధి కోసం రూ.850 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. భారత్‌లోనే దాదాపు 15వేల ఛానళ్లకు పదిలక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లకు మార్గదర్శిగా మారిందన్న నీల్.. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రభుత్వాధినేతగా మోదీకి అరుదైన గుర్తింపు దక్కిందన్నారు.