భారత్-పాక్ ఘర్షణల వేళ.. రెండు దేశాలు యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. పాక్ చేసిన తప్పుకు శిక్ష వేసి తీరుతామని ఇటీవలె మోదీ హెచ్చరించగా.. సైన్యానికి సైతం పూర్తి స్వేచ్ఛనిచ్చారనే వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా భారత ఎయిర్ ఫోర్స్‌కి కీలక స్థానమైన ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ గంగా ఎక్స్‌ప్రెస్ వేపై యుద్ధ విమానాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఎలా స్పందించాలి.. ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు.

యుద్ధవిమానాలు పగటి వేళలలోనే కాకుండా, రాత్రి వేళ్లల్లోనూ ఇక్కడ దిగేందుకు వీలుగా షాజహాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. యుద్ధవిమానాలు పగటి వేళలలోనే కాకుండా, రాత్రి వేళ్లల్లోనూ ఇక్కడ దిగేందుకు వీలుగా షాజహాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. యుధ్ధ సమయంలో ఇది కీలకం కానుంది. దీనికి తోడు లక్నో-ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలూ అదనపు బలం.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ తర్వాత యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్‌ప్రెస్‌వే షాజహాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే కావడం విశేషం. రాఫెల్, ఎస్‌యూ-30 ఎంకేఐ, మిరేజ్ 2000, మిగ్-29, జాగ్వార్, సి-130జే సూపర్ హెర్క్యులెస్, ఏఎన్-32, ఎఐ-17 V5 హెలికాప్టర్ తదిరర ఐఏఏ విమానాలు ఈ డ్రిల్స్‌లో పాల్గొంటున్నాయి.