
సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరో వివాదంలో చిక్కుకున్నారు. గత నెల 26న తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ ట్రైబల్ కల్చర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధి కిషన్‌రాజ్ చౌహాన్ ఆరోపించారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ పై ఫిర్యాదు చేశారు. గిరిజనులను అవమానించేలా మాట్లాడితే పేరొస్తుందనుకుంటే పొరపాటేనని.. దారుణమైన ఈ వ్యాఖ్యలపై చర్యలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.