RRvsMI: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే బౌండరీలతో సెంచరీ బాది సంచలనం సృష్టించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని(Vaibhav) ప్రపంచమంతా ప్రశంసించింది. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్తు దొరికిందని సంబరపడింది. అయితే, దేశమంతా ఒకలా స్పందిస్తే.. భారత్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) మరోలా స్పందించారు.

అతడిని ఇప్పుడే అంత పైకి ఎత్తొద్దని.. భారీ షాట్ల మాయలో పడి బౌలర్లకు దొరికిపోతాడన్నారు. అతనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. ద్రవిడ్ శిక్షణలో అతను మరింత రాటుదేలుతాడన్నారు. అయితే సునీల్ గవాస్కర్ మాటే నిన్నటి ముంబైతో(Mumbai) మ్యాచ్‌లో నిజమైంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ కి వచ్చిన వైభవ్.. భారీ షాట్ ఆడబోయి రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గవాస్కర్ మాటే నిజమైందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండో మ్యాచ్‌లోనే డకౌట్ అవ్వడంపై పలువురు విమర్శిస్తున్నారు. వైభవ్ ఔటయ్యి వెళ్తుంటే రోహిత్ శర్మ భుజం తట్టి ప్రోత్సహించడంతో రోహిత్‌పై ప్రశంసిస్తున్నారు.