India-Pakistan: కెనడా (Canada) కేంద్రంగా భారత్‌లో ఉగ్రకుట్రలకు పథకాలు రచిస్తున్న పన్నూ మరోమారు భారత్‌పై తన ద్వేషాన్ని వెల్లగక్కాడు. భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే యుద్ధానికి సిక్కులంతా దూరంగా ఉండాలని ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పిలుపునిచ్చాడు. భారత్ తరఫున ఎట్టి పరిస్థితుల్లోనూ సిక్కులెవరూ పోరాడొద్దని, మనకు పాకిస్థాన్ మిత్రదేశమంటూ ఓ వీడియో విడుదల చేశాడు. పంజాబ్ సరిహద్దులో ఉన్న ప్రతీ ఒక్కరూ పాకిస్థాన్ కు సహకరించాలని.. ఇదే భారత్‌కు మోదీకి (Modi) ఫైనల్ వార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను అంతం చేసేందుకు ఇది అవకాశమని భావించాలని, వ్యతిరేక శక్తులంతా ఒక్కటవ్వాలంటూ ఉగ్రవాది పన్నూ కోరాడు.

అయితే, దీనిపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిక్కుల పుట్టుక నుంచి భారత్ కోసం పోరాడుతున్నారని.. సైన్యంలోనూ మా శాతమే ఎక్కువని.. ఎవడో దుష్టుడు పిలుపునిస్తే పాటించేది సిక్కులే కాదంటూ ప్రకటన విడుదల చేస్తున్నారు.