
Ajith: తాను ఏదో ఒకరోజు సినిమాలు బలవంతంగా మానేయాల్సి రావొచ్చని తమిళ సూపర్‌స్టార్ అజిత్ అన్నారు. ప్రతిరోజూ తెల్లవారు నిద్రలేచేపాటికి బతికి ఉండటమే అదృష్టంగా భావిస్తానని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన అజిత్.. అందుకే ప్రతీ నిమిషాన్ని తనకు నచ్చినట్టు, సంతోషంగా బతికేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు. వచ్చే నిమిషం ఏం జరుగుతుందో కూడా చెప్పలేం.. ఏదీ మన చేతుల్లో లేదు.. నాకిష్టమైన రేసింగే కాదు, సినిమాలు కూడా ఏదో ఒకరోజు నా నుంచి దూరం కావొచ్చంటూ తెలిపారు.
దీనిపై సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ప్రాక్టికల్ లైఫంటే ఇదేనంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. అన్నా నువ్వు రేసింగ్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోకన్నా అంటూ అజిత్‌కు హితవు పలుకుతున్నారు. (Tamil Superstar)