ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC Steel Limited) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 934 కాంట్రాక్ట్ ఎంప్లాయ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మే 8వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 ఏళ్లు వరకు ఉండొచ్చు.
జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 – రూ.1,70,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2025
దరఖాస్తులకు చివరి తేదీ: మే 8, 2025
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.