PM Modi AP Visit: ఏపీలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మే 2న మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూమిటి నేతలు స్వాగతం పలుకనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏపీలో పర్యటించనున్నారు. మే 2న రాజధాని అమరావతి పున: ప్రారంభకార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏ సమయంలో ఏపీకి రానున్నాను.. ఏయే ఏయే సమయాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు.. ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియజేస్తూ షెడ్యూల్ విడుదలైంది. రేపు (మే2) మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూమిటి నేతలు స్వాగతం పలుకనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్‌కు పీఎం చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఘన స్వాగతం పలకనున్నారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు.