
UP: భర్త గడ్డం నచ్చని ఓ మహిలళ.. క్లీన్ షేవ్‌తో కళ్ల ముందు తిరగాడుతున్న మరిదితో ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మీరఠ్‌లోని లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన మౌలానా షకీర్‌కు అర్షి అనే యువతితో ఆర్నెళ్ల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అర్షి.. తొలిరాత్రే భర్త గడ్డంపై అభ్యంతరం తెలిపింది. గడ్డం తీసేది లేదని షకీర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాతా ఇదే విషయమై ఆమె తనతో చాలాసార్లు గొడవ జరిగింది. షకీర్ ప్రతీరోజు ఉదయం పనికి వెళ్లిపోయాక.. ఇంట్లో ఆయన తల్లి, సోదరుడు ఉండేవారు. క్లీన్ షేవ్‌తో కనిపించే అతని సోదరుడి పట్ల ఆకర్షితురాలైన ఆమె.. అతనితో సంబంధం కొనసాగించింది. బుధవారం ఇద్దరూ కలిసి ఇళ్లు వదిలి పారిపోయారు. ఈ విషయంపై అర్షి తల్లిదండ్రులు స్పందిస్తూ.. ఇకపై ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. దీనిపై భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.