IPL పాస్‌లు అమ్ముకుంటున్నారు

Share this article

IPL: ఐపీఎల్ 2025ఫ హైద‌రాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్‌సీఏ)కు స‌న్‌రైజ‌ర్స్ టీం ఇస్తున్న ఐపీఎల్ కాంప్లిమెంట‌రీ పాస్‌ల‌ను కొన్ని ప్రైవేటు సంస్థ‌లు, క్ల‌బ్‌లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నాయ‌ని హెచ్‌సీఏ మాజీ కార్య‌ద‌ర్శి శేష్‌నారాయ‌ణ ఆరోపించాడు. ఎఫ్ 7 నుంచి ఎఫ్ 16 వ‌ర‌కు ఉన్న కార్పొరేట్ బాక్సుల్ని హెచ్‌సీఏలోని కీల‌క వ్య‌క్తులు ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించాడు. ఈమేర‌కు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కొత్త‌కోట శ్రీనివాస్ రెడ్డికి బ‌హిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. స‌న్‌రైజ‌ర్స్ టీంకు హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ‌కు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. కాంప్లిమెంట‌రీ పాస్‌లు, స‌న్‌రైజ‌ర్స్‌తో సంబంధాలు, హెచ్‌సీఏ ప‌రిపాల‌న వ్య‌వ‌హారాల‌పై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా సాగుతోంది.

ఈ టికెట్లు హెచ్‌సీఏ వాటాదారుల‌కు ఇవ్వాలి. అంత‌ర్జాతీయ ఆట‌గాళ్లు, ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట‌ర్లు, మాజీ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు ప్ర‌తీ మ్యాచ్‌కు రెండేసి పాస్‌లు ఇస్తారు. కానీ హెచ్‌సీఏ కార్య‌ద‌ర్శి, అధ్య‌క్షుడు, కోశాధికారి 400-500 పాసుల‌ను సొంతానికి వాడుకుంటున్నారు. హైద‌రాబాద్ క్రికెట్‌కు సేవ‌లందించిన వారిని అవ‌మానిస్తున్నారు. బ్లాక్ లో వీటిని రూ.వేల‌కు అమ్ముకుంటున్నారు. – శేష్ నారాయ‌ణ‌, హెచ్‌సీఏ మాజీ కార్య‌ద‌ర్శి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *