పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని, ఆయన ఇంట్లోనే చర్చలు జరుగుతున్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పహల్గాం దాడి ఘటనపై పాక్ ప్రధాని ఇంకా ఎందుకు ఖండించలేదని.. దాడి జరుగుతుందని ముందే తెలిసినా ఎందుకు భద్రతా దళాలను అప్రమత్తం చేయలేదని కనేరియా నిప్పులు చెరిగారు.

మన దేశ ప్రమేయమే లేకుంటే ఎందుకు ఇంకా దాడిని వెనకేసుకొస్తున్నారు..? ఉగ్రవాదులను మీరు పెంచిపోషిస్తున్నారని విషయం ప్రపంచానికి తెలుసంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు కనేరియా.