Cricket: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ను మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ దగ్గరికి శిక్షణకు పంపితే క్రికెట్లో అతను మరో క్రిస్ గేల్ అవుతారని యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్‌కు ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌కు కూడా అవకాశం దక్కలేదు. దేశవాళీలోనూ అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో యోగ్రాజ్ స్పందిస్తూ. నేను అర్జున్‌కు బౌలింగ్ కంటే బ్యాటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని సలహా ఇచ్చానన్నారు.

ఒకవేళ సచిన్ గనక తన కొడుకును యువరాజ్ దగ్గరకు శిక్షణకు పంపిస్తే వెస్టిండీస్ దిగ్గజం గేల్లాగా తీర్చిదిద్ది బయటికి పంపిస్తారన్నారు. ఒక పేసర్ తరచూ ఒత్తిడికి గురైతే బౌలింగ్ చేయలేడని చెప్పుకొచ్చారు. అయితే అర్జున్ గతంలో యోగ్రాజ్ దగ్గర శిక్షణ పొందిన విషయం తెలిసిందే.