
Gold Rate: బంగారం ధర తగ్గుముఖం పట్టింది. తులం 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.2వేలకు పైనే తగ్గింది. అంతర్జాతీయ సమస్యలతో భారత మార్కెట్లో ఆల్‌టైం గరిష్టానికి చేరిన బంగారం ధర గత మూడు రోజులుగా కాస్త కిందికి దిగి వస్తోంది. గురువారం ఒక్కరోజే 10గ్రాముల బంగారం ధర రూ.2 వేలకు పైగా తగ్గింది.
నేడు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.2,180 తగ్గి మొత్తంగా తులానికి రూ.95,730కి చేరుకుంది. దాదాపు గత పది రోజుల్లో రూ.5వేల మేర తగ్గింది. ఇప్పటివరకూ బంగారం ధర భారత దేశీయ మార్కెట్లలో పది గ్రాములకు రూ.1లక్ష దాటడం ఇదే మొదటిసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి, ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు బంగారం ధర మీద ప్రభావం చూపినట్లు విశ్లేషకుల అంచనా.