మైనింగ్ కుంభ‌కోణంలో బీజేపీ ఎమ్మెల్యే గాలికి ఏడేళ్ల జైలు!

Share this article

Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించింది. మాజీ కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy) సహా ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని(Sabitha Indra Reddy) నిర్దోషిగా ప్రకటించి కోర్టు ఊరట కలిగించింది.ఈ తీర్పు త‌ర్వాత ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా(BJP MLA) గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి స‌భ్య‌త్వం ర‌ద్ద‌యింది.

కేసు నేపథ్యం:
ఒబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అనుమతులు లేకుండా ఖనిజాలను తవ్వుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగించారన్నది ప్రధాన ఆరోపణ. రాజకీయ ప్ర‌లోభాల‌కు అధికారులు తలొగ్గారని, అనేక నిబంధనలు ఉల్లంఘించారన్నది సీబీఐ ఆరోపణలలో భాగం.

కోర్టు ఏం చెప్పింది..? :
మంగళవారం వెలువడిన తీర్పులో, గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10,000 జరిమానా విధించింది. ఆయన సోదరుడు, ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాస రెడ్డికి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌కు, గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు మెఫజ్ అలీఖాన్‌కు కూడా సమాన శిక్ష ఖరారు చేశారు. ఓఎంసీ కంపెనీపై రూ.1 లక్ష జరిమానా విధించారు.

సబితా ఇంద్రారెడ్డికి ఊరట:
కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అప్ప‌టి గ‌నుల శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై న్యాయస్థానం ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం సబితా మీడియాతో మాట్లాడుతూ.. “న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అంటూ స్పందించారు.

ఈ విచారణలో హైలైట్స్:
16 ఏళ్ల పాటు కొనాసాగిన వివాదం.
మొత్తం 219 మంది సాక్షుల విచారణ.
3,400 పత్రాల ఆధారాల పరిశీలన
5 ఛార్జ్‌షీట్లు

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *