TDSలో ఈ 5 తప్పులు చేస్తే.. మీకు నోటీసులు ఖాయం!

tds

Share this article

TDS (Tax Deducted at Source) అనేది పన్ను వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించబడిన వ్యవస్థ. కానీ ఇందులో చిన్నచిన్న పొరపాట్లే పెద్ద సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ఐటీ నోటీసులు రావడానికి ఇదొక ప్రధాన కారణం అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, లేదా స్వతంత్ర వృత్తిదారులు అయినా సరే – ఈ TDS తప్పులను నివారించాలి.

వ్యాస‌క‌ర్త‌: జ‌యంత్‌, చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌

✍️

ఇవే ఆ ఐదు కార‌ణాలు..

  1. పూర్తిగా TDS కట్ చేయకపోవడం

చిన్న కంపెనీలు లేదా స్టార్టప్‌లు అద్దెలు, వడ్డీ, ప్రొఫెషనల్ ఫీజుల వంటి చెల్లింపులపై TDS కట్ చేయడం మరిచిపోతుంటారు. ఇది చట్టపరంగా తప్పు.

ఉదాహరణ: ఒక నివాసితునికి నెలకు ₹60,000 అద్దె చెల్లిస్తే, దానిపై 10% TDS కట్ చేయాలి. లేకపోతే వడ్డీ, జరిమానా, ఇంకా ఖర్చుల తిరస్కరణ (Section 40(a)(ia))కి గురవుతారు.

  1. ఆలస్యంగా TDS చెల్లించడం

TDS కట్ చేసిన తరువాత, దానిని తదుపరి నెల 7వ తేదీలోపు ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. ఒక్క రోజు ఆలస్యమైనా 1.5% వడ్డీ (ప్రతి నెలకో భాగానికి కూడా) వసూలవుతుంది.

ఉదాహరణ: మే 31న కట్ చేసిన TDS జూన్ 7లోపు చెల్లించాలి. జూన్ 8న చెల్లిస్తే కూడా, ఒక నెల వడ్డీ పడుతుంది.

  1. తప్పుగా PAN నంబర్ నమోదు చేయడం లేదా ఇవ్వకపోవడం

TDS రిటర్నులో చెల్లింపు చేస్తున్న వ్య‌క్తికి సంబంధించిన పాన్ నెంబ‌రు త‌ప్పుగా న‌మోదు చేయ‌డం లేదా అస‌లు పాన్ నెంబ‌రును న‌మోదు చేయ‌పోవ‌డం వల్ల 26AS ఫారంలో తేడా వస్తుంది. అంతే కాకుండా, ఈ పొర‌పాటు కార‌ణంగానే 10%కి బదులుగా 20% TDS రేట్ వర్తించవచ్చు.

TDS deduct చేసేముందే PAN నంబర్‌ను NSDL వెబ్‌సైట్ ద్వారా వెరిఫై చేసుకోవ‌డం ఉత్త‌మం.

  1. TDS రిటర్నులో విభేదాలు

Form 26Q, 27Q లాంటి క్వార్టర్ రిటర్న్స్ లో సెక్షన్ కోడ్‌లు, మొత్తాలు, PAN వివరాలు తప్పుగా ఉండడం వల్ల నోటీసులు వస్తాయి. వాటిని 26AS ఫారంతో క్రాస్ చెక్ చేయడం చాలా ముఖ్యం.

ఉదాహరణ: కాంట్రాక్ట్ చెల్లింపుపై Section 194C వేసే బదులు పొరపాటుగా 194J వేయడం.

  1. TDS సర్టిఫికెట్లు (Form 16 / 16A) ఇవ్వకపోవడం

TDS deduct చేసిన తరువాత, దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను డిడక్టీకి సమర్పించడం తప్పనిసరి. Form 16 (సెలరీ) & Form 16A (నాన్-సెలరీ) ఇవ్వకపోతే, డిడక్టీ పన్ను రిటర్ను ఫైల్ చేయలేరు. ఇది ఫిర్యాదులు, స్క్రూటినీకి దారితీస్తుంది.

చెల్లింపు గ‌డువు తేదీలు:
Form 16A: TDS రిటర్న్ డ్యూ డేట్‌కి 15 రోజుల్లోగా చెల్లింపు జ‌ర‌గాలి. Form 16: ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత జూన్ 15లోపు ఈ చెల్లింపు చేయాల్సి ఉంటుంది.

చివ‌రిగా.. ఇప్పుడు ఐటీ శాఖ AI ఆధారిత మ్యాచింగ్ టూల్స్‌ను, అల్గారిథ‌మ్స్‌ను ఉపయోగిస్తోంది. మీరు చేసిన చిన్న TDS పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు.

ప‌రిష్కారంగా.. టీడీఎస్ స‌మ‌యానికి చెల్లించ‌డం, ఖ‌చ్చితంగా డిపాజిట్ చేయ‌టం, రిట‌ర్న్‌ల‌ను స‌రిగా ఫైల్ చేయ‌డంతో పాటు సర్టిఫికెట్లు ఇవ్వడం మర్చిపోవద్దు.

📰 www.ognews.in

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *