
India-Pakistan: భారత్ పై యుద్ధానికి కాలుదువ్వుతున్న దాయాది పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఏళ్లుగా బలూచిస్థాన్ వేర్పాటు కోసం పాకిస్థాన్ తో పోరాటం చేస్తున్నరెబల్ సైన్యం(Rebel Army) ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) అదను చూసి దెబ్బ కొట్టింది. భారత్ తో యుద్ధ సన్నాహాల్లో ఉన్న పాక్ ఆర్మీపై దాడికి పాల్పడింది. తుర్భత్, డుక్కీ మీదుగా వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌లపై దాడి చేసిన బీఎల్ఏ.. 22 మంది సైనికులను మట్టుబెట్టింది. ఈ దాడిలో దాదాపు 50 మందికిపైగా సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇదే పోరులో ఆరుగురు బీఎల్ఏ వీరులు సైతం మరణించారని ఆ సైన్యం ప్రకటించింది.
ఇక్కడే కాకుండా పాకిస్థాన్ దేశవ్యాప్తంగా పలు చోట్ల బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(Baloochistan Liberation Army) మెరుపు దాడులకు పాల్పడినట్లు అక్కడి మీడియా స్పష్టం చేసింది. ఇప్పటికే 7కు పైగా పట్టణాలు బీఎల్ఏ రెబల్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు మూడు చోట్ల జరిగిన దాడుల్లో ఇరువైపులా నష్టం జరగ్గా.. పాకిస్థాన్ ఆర్మీకి(Pak Army) పెద్ద దెబ్బే పడినట్లు సమాచారం.