2025 Jobs: ఈ 5కోర్సులు నేర్చుకుంటే.. ఉద్యోగం గ్యారంటీ!

2025 IT Jobs

Share this article

2025 Jobs: ప్రస్తుతం ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్సు నుంచి మొద‌లుకొని ఏవేవో కొత్త సాంకేతిక‌త‌లు జీవితాల్నే ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి. డిగ్రీలు, బీటెక్ స‌ర్టిఫికేష‌న్లు కూడా స‌రిపోవ‌ట్లేద‌నేది ఒప్పుకోలేని నిజం. స్కిల్స్ ఉన్నవారికే ఉద్యోగాలు వస్తున్న టైమ్ ఇది. టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు వందలాది కంపెనీలు స్పెషలైజ్డ్ కోర్సులు చేసిన వారికి మాత్రమే ప్లేస్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. డిగ్రీలు పూర్తి చేసి ఏదో ఓ ఉద్యోగంతో నెట్టుకొస్తున్న‌.. లేదా ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉండి.. సెటిల్ అయ్యేందుకు ఏం చేయాలా అనే క్వ‌శ్చ‌న్ మార్క్ ఉన్న తెలుగు యువ‌త కోసం ఈ ఆర్టిక‌ల్‌ మీకు న‌చ్చితే తెలిసిన అంద‌రికీ షేర్ చేయ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

ఈ కోర్సులు కొద్దిగా ఖర్చవవచ్చు, కానీ ఉద్యోగం గ్యారంటీ. అయితే, పూర్తి ఫీజు చెల్లించకుండానే ఉద్యోగం వ‌చ్చాకే చెల్లించ‌మ‌నే అనే అవ‌కాశ‌మూ హైద‌రాబాద్‌లో లేదా ఆన్‌లైన్‌లో చాలా సంస్థ‌లే ఇస్తున్నాయి. మొద‌టి నెల జీతంతో పోల్చితే ఈ కోర్సు ఫీజు అంత పెద్ద‌దేం కాదు.

సాధారణంగా టెక్నికల్ కోర్సును పూర్తి చేయడానికి 3 నెలల నుండి 9 నెలల వరకు టైమ్ పడుతుంది. కోర్సు బేసిక్ స్థాయి అయితే 10,000 నుండి 30,000 వరకు ఫీజు ఉంటుంది. అడ్వాన్స్‌డ్ ప్లేస్‌మెంట్ కోర్సులైతే 50,000 నుండి 1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఉన్న 5 కోర్సులివే..

2025 jobs
  1. డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
    ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగం. డేటా అనలిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజినీర్, AI డెవలపర్ లాంటి ఉద్యోగాలకు డిమాండ్ చాలా ఎక్కువ.

నేర్చుకోడానికి ప‌ట్టే స‌మ‌యం: 6-9 నెల‌లు
కోర్సు ఫీజు: ₹60,000 – ₹1,50,000
ఉద్యోగ అవ‌కాశాలు: 90% chance with top MNCs
Average Salary: ₹6-9 లక్షలు సంవ‌త్సరానికి (ఏ అనుభ‌వం లేని ఫ్రెష‌ర్ల‌కు)

👉 Learn at: UpGrad, Simplilearn, NxtWave

  1. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్
    వెబ్ డెవలపర్లు ఏ కంపెనీకి అయినా అవసరం. ప్రస్తుతానికి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే పక్కా ఉద్యోగ భద్రత.

నేర్చుకోడానికి ప‌ట్టే స‌మ‌యం: 6-8 months
కోర్సు ఫీజు: ₹50,000 – ₹1,00,000
ఉద్యోగ అవ‌కాశాలు: 95% chance
Average Salary: ₹5-8 లక్షలు వార్షికం (ఏ అనుభ‌వం లేని ఫ్రెష‌ర్ల‌కు)

👉 Learn at: Masai School, Newton School, NxtWave

  1. క్లౌడ్ కంప్యూటింగ్ & డెవాప్స్
    AWS, Google Cloud, Microsoft Azure వంటి క్లౌడ్ ప్లాట్‌ఫాంలు వాడే కంపెనీలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

Duration: 4-6 months

Course Fee: ₹50,000 – ₹1,20,000

Placement Opportunity: 85% chance

Average Salary: ₹5-8 లక్షలు వార్షికం (ఏ అనుభ‌వం లేని ఫ్రెష‌ర్ల‌కు)

👉 Learn at: Great Learning, Edureka, Simplilearn

  1. సైబర్ సెక్యూరిటీ
    ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో డేటా సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్యం. ఎక్కువ మంది ట్రెయిన్ అయినవాళ్లు లేని ఫీల్డ్ కావడం వల్ల వేగంగా ఉద్యోగాలు వస్తున్నాయి.

Duration: 4-6 months

Course Fee: ₹40,000 – ₹1,00,000

Placement Opportunity: 80% chance

Average Salary: ₹5-9 లక్షలు వార్షికం (ఏ అనుభ‌వం లేని ఫ్రెష‌ర్ల‌కు)

👉 Learn at: EC-Council, Simplilearn, Coursera

  1. డిజిటల్ మార్కెటింగ్
    చిన్నా, పెద్దా ప్రతి కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ టైంలో ఉద్యోగం పొందే అవకాశం.

Duration: 3-4 months

Course Fee: ₹15,000 – ₹50,000

Placement Opportunity: 85% chance

Average Salary: ₹6-8 లక్షలు వార్షికం

👉 Learn at: Google Certified, Udemy, Internshala

ఈ కోర్సులు ఎందుకు ప్రత్యేకం?
ఈ కోర్సులు నేర్చుకోవ‌డం వ‌ల్ల స‌ర్టిఫికేట్ మాత్ర‌మే కాదు. మార్కెట్లో ప్ర‌స్తుత పోటీకి స‌రిప‌డా ఉద్యోగాలు ఈ రంగాల్లో ఉన్నాయి. కాస్త దృష్టి పెట్టి ఇందులో ప‌ట్టు సాధించ‌గ‌లిగితే మీకు తిరుగుండ‌దు. ఎవ‌రి రిఫ‌రెన్సూ లేకుండానే ఫ్రెష‌ర్స్‌కి అవ‌కాశాలు బోలెడున్నాయి. ప్లేస్‌మెంట్ గ్యారంటీ ఉన్న నమ్మకమైన సంస్థలను ఎంచుకొని, రోజుకు కనీసం 3 గంటలు సీరియస్‌గా చదివితే 6-9 నెలల్లో మంచి ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది.

ప్లేస్‌మెంట్ గ్యారంటీ కోర్సులు: Masai School, Newton School, NxtWave వంటి సంస్థలు ఉద్యోగం వచ్చిన తర్వాతే ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నాయి.

ఎంత Competition ఉంది?
ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల మంది అభ్యర్థులు ఇండియాలో టెక్ కోర్సులు నేర్చుకుంటున్నారు. అందుకే మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రారంభించాలి. పాత పరీక్షలు, మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి కంపెనీలకు సిద్ధంగా ఉండాలి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *