Gujarath: తన వద్ద ట్యూషన్‌కి వచ్చే 11 ఏళ్ల విద్యార్థితో ఓ యువ లేడీ టీచర్(23) పారిపోయింది. గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ఓ టీచర్, తన ట్యూషన్ స్టూడెంత్‌తో రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. నాలుగు రాష్ట్రాలు దాటి రాజస్థాన్ సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సులో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సూరత్‌కు తరలించారు. టీచర్ తన కుమారుణ్ని కిడ్నాప్ చేసిందని అతని తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. అయితే, ఇద్దరూ తమ తమ ఇళ్లలో కుటుంబసభ్యుల తిట్లు పడలేకే పారిపోయారని ప్రాథమిక విచారణలో తేలిందని.. ఇద్దరి మధ్యా ఏదైనా బంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ భగీరథ్ గఢవీ తెలిపారు.
11ఏళ్ల విద్యార్థితో లేడీ టీచర్ జంప్!
