హిట్ (HIT) యూనివర్స్‌లో భాగంగా విడుదలైన తాజా చిత్రం హిట్ 3 నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గురువారం విడుదలైన చిత్రం వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో బలంగా వినిపించిన ఓ వార్త నిజమనే అభిప్రాయం ప్రేక్షకులకు వచ్చింది. దీని తర్వాత వచ్చే హిట్ 4లో తమిళ నటుడు కార్తీ హీరో అనే ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ సినిమాలో కార్తీ అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. రత్నవేల్ పాండియన్ అనే పోలీస్ అధికారిగా.. గురజాడ చెప్పిన దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అనే డైలాగ్‌తో కార్తీ ఎంట్రీతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. ఈ ఎంట్రీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.
హిట్ 4 హీరో అతడేనా..?
