నాని కీలక పాత్రలో నటించిన హిట్ 3 సినిమా విడుదలైంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు ముందు వచ్చిన సినిమాలు ఈ సినిమాకు హైప్ పెంచాయి. అయితే, శైలేష్ కొలను తీసిన ఈ మూడో సినిమా జనాల్ని మెప్పించిందో లేదో ఓజీ షార్ట్ రివ్యూలో..

హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు కథల్లో సస్పెన్స్ థ్రిల్‌తో పాటు పరిశోధన కోణం ఎక్కువ. మూడో కేసుగా వచ్చిన ఈ సినిమాలో ఆ రెండింటితో పాటు ఓ చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు. భయపెట్టే ఆ ప్రపంచంలోకి హీరో వెళ్లడం.. లక్ష్యాన్ని చేధించడంలో ఎదురయ్యే ట్విస్టులు, ఫైట్లు బీభత్సంగా ఆకట్టుకుంటాయి. మన చుట్టూ ఉన్నవాళ్లూ ఇలా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందన్న భయం థియేటర్ల నుంచి బయటికొచ్చిన ప్రేక్షకులను వెంటాడుతుంది. సున్నిత మనస్కులు కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ను ఆస్వాదించే సినిమా ప్రేమికులకు ఈ వేసవి సెలవులకు మంచి సినిమా దొరికినట్టే. హాలివుడ్ ఆక్షన్ సినిమాల్ని తలదన్నేలా ఉండే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. పాటలు, హీరోయిన్‌తో రొమాన్సు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండి కంప్లీట్ సినిమా అనిపించుకుంది హిట్ 3. ఇక నానీ నటనకు మాటల్లేవు!
ఓజీ రివ్యూ: 3.75 5