జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న హిందీ చిత్రం ‘వార్ -2’ (War -2). హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తారక్ ఉత్తర భారతదేశంలోనూ తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అయితే… ఈ సినిమా విషయంలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న ఓ పుకారుకు వివరణ ఇచ్చారు నిర్మాత నాగవంశి.
దేవర సినిమాకు పంపిణీదారుగా పనిచేసిన నాగవంశీ.. సినిమా విడుదల తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కలెక్షన్ల విషయంలో, ఏయే ప్రాంతాల్లో బ్రేకీవెన్ అయిందన్న విషయాలపై తీవ్ర చర్చ జరిగింది. అయితే… తాజాగా ఎన్టీఆర్ మూవీ ‘వార్ -2’ పంపిణీ హక్కుల్ని కూడా సూర్యదేవర నాగవంశీ రెండు తెలుగు రాష్ట్రాలకూ తీసుకున్నాడనే ప్రచారం జరిగింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘వార్ -2’ హక్కుల్ని తాము తీసుకోలేదని, ఒకవేళ అదే జరిగితే… అధికారికంగా ప్రకటిస్తామని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని ఎన్టీఆర్ అభిమానులకు ఆయన తెలిపాడు.