India-Pakistan: భారత్‌లో మరోసారి దాడికి ప్రయత్నించిన ముష్కరుల కుట్రను భారత సైనికులు భగ్నం చేశారు. భారత్ పాక్ సరిహద్దులో, అమృత్‌సర్ సమీపంలో బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిలో తుపాకులు, గ్రనేడ్లు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఇలా ఆయుధాలు పట్టబడటం కలకలం రేపుతోంది.

దేశంలో మరిన్ని దాడులు జరగున్నాయని ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన బృందాలు ఎక్కడికక్కడ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. బీఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ విభాగం సమాచారం మేరకు బుధవారం పక్కా సమచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. బంగ్లా సరిహద్దులోనూ పాక్ ఐఎస్ఐ కలకలం సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల యూనస్ అధికారంలోకి వచ్చాక.. పాక్-బంగ్లా బంధాలు బలోపేతమయ్యాయి. దీంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, మిలటరీ అధికారులు బంగ్లాదేశ్‌లోని భారత్ సరిహద్దువైపునకు రావడం పెరిగింది. ఆ దేశంలోని ర్యాడికల్ గ్రూప్‌లను ఏకతాటిపైకి తెచ్చేందుకు పాక్ పన్నాగాలు చేస్తున్నట్లు సమాచారం.