
Dubai: భారత్‌పై ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) అంశాలతో పాటు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్(Pakistan) వ్యవహారాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని పార్టీల నుంచి కీలక నేతలతో కూడిన బృందాల(All party delegation) ను ఇప్పటికే సన్నద్ధం చేసింది. ఇందులో తొలి బృందం గురువారం ఉదయం దుబయ్ చేరుకుంది. మహారాష్ట్ర(Maharashtra) ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ లత ఏక్‌నాథ్ శిండే(Dr Srikanth Eknath Shinde) నేతృత్వంలో దుబయ్ చేరుకున్న ఈ బృందం అక్కడి ప్రభుత్వాధినేత(Dubai Prince)లను కలిసింది.

ఈ మేరకు ఉగ్రవాదానికి పాక్ ఇస్తున్న మద్దతును ఆధారాలతో సహా నేతలు వివరించారు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఉగ్రవాదంతో జరుగుతున్న నష్టం.. అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. దీనిపై దుబయ్(Dubai)లోని భారత ఎంబసీ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దుబయ్‌లోనే తొలి అడుగు పెట్టామని.. ఇక్కడ ఘనమైన స్వాగతం లభించిందని పేర్కొంది. దుబయ్‌తో భారత్‌కు ఉన్న మైత్రికి ఇది సంకేతమన్నారు.
మరో బృందం జపాన్ చేరుకున్నట్లు సమాచారం. మరికొన్ని బృందాలు సైతం ఈ రెండు, మూడు రోజుల్లో భారత్‌కు మద్దతుగా నిలిచే అన్ని దేశాలు తిరగనున్నాయి. అంతర్జాతీయ వేధికపై పాక్‌ను ఒంటరి చేసి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృందాల్లో మంచి కమ్యునికేషన్ తో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపై పరిజ్ణానం ఉన్న నేతలను ఎన్డీయే సర్కారు ఎంపిక చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు సైతం ఆ పార్టీ వద్దన్నా చోటు కల్పించడం గమనార్హం.