
Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1(APPSC Group 1) పరీక్షల కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా అరెస్టయిన పమిడికాల్వ మధుసూధన్(ధాత్రి మధు) కు విజయవాడ కోర్టు 14రోజుల రిమాండ్(Remand) విధించింది. గతేడాది వైకాపా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనాన్ని ప్రభుత్వం మధుసూధన్‌కు చెందిన ఐధాత్రి(I-Dhatri) అనే సంస్థకు అప్పజెప్పింది. అయితే మెరిట్ విద్యార్థులు చాలమంది ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించగా.. వారు రీ ఎవాల్యూషన్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై పునః పరిశీలనకు కోర్టు ఆదేశించింది.
జర్నలిస్టు పమిడికాల్వ మధుసూధన్(Pamidikalva Madhusudhan) కు చెందిన ఐధాత్రి సంస్థ చేసిన డిజిటల్ ఎవాల్యూయేషన్‌లో 60శాతం తప్పులే ఉన్నట్లు గుర్తించడంతో పాటు కావాలనే వైకాపా అనుయాయులు, అనర్హులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేశారని గుర్తించారు. దీంతో ఇటీవలె ప్రధాన సూత్రధారి ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతని న్యాయస్థానం ఈ నెల 21 తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో మధును పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత మంది వైసీపీ కి చెందిన కీలక నేతలు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది.