ప్రస్తుత జీవనశైలిలో అనేక మందికి ఆర్థిక అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ చేసే ధోరణి క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి క్రమంలో ఏదైనా పెద్ద మొత్తంలో నగదు కావాలంటే లోన్స్ కోసం అనేక యాప్స్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారికి గూగుల్ పే (GPay) ఈజీగా లోన్స్ అందిస్తోంది. రూ.30,000 నుంచి రూ.12 లక్షల వరకు లోన్లు తీసుకునే అవకాశం ఇస్తోంది. అయితే గూగుల్ పే నేరుగా రుణాలను అందించదు. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా తక్షణ వ్యక్తిగత రుణాలను అందిస్తోంది.
ఈ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు
మీరు భారతదేశ పౌరులై, Google Payని ఉపయోగిస్తూ ఉండాలి. లోన్ పొందడానికి, మీ CIBIL స్కోరు బాగుండాలి. వ్యక్తిగత రుణం పొందడానికి, మీ వయస్సు 21 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. పర్సనల్ లోన్ పొందడానికి, మీకు సొంత బ్యాంక్ ఖాతా కల్గి ఉండాలి.
పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి మొదలైనవి అవసరం
రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- Google Pay యాప్ తెరిచి, మనీ ట్యాబ్‌కు వెళ్లండి
- లోన్స్ విభాగంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను చూడండి
- అందుబాటులో ఉన్న ఆఫర్‌పై నొక్కి, సూచనలను అనుసరించండి
- ఆ తర్వాత KYC పత్రాలను అప్‌లోడ్ చేయండి,
- రుణ ఒప్పందాలపై ఇ సంతకం చేయండి
- లోన్ ఆమోదం పొందిన తర్వాత మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది
రుణం తిరిగి చెల్లింపు ప్రక్రియ
Google Pay ద్వారా రుణం నెలవారీ EMI మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా తీసివేయబడుతుంది. అందువల్ల, జరిమానాను నివారించడానికి తగిన సమయంలో చెల్లింపులు చేసుకోవాలి. రుణ దరఖాస్తు సమయంలో గడువు తేదీలు, మొత్తాలతో సహా తిరిగి చెల్లించే షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు. రుణం తీసుకునే ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. రుణం తీసుకునే వ్యక్తి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా ఆదాయ వనరును కలిగి ఉండటం చాలా ముఖ్యం.