Delhi: కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.578.46 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.163.92 కోట్లతో పోలిస్తే ఇది మూడింతల కంటే ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ స్థూల ఆదాయం 28.72 శాతం పెరిగి రూ.6,114.34 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా కంపెనీ రూ.2,054.71 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 25.23 శాతం ఎక్కువ. అధిక అమ్మకాలు, మెరుగైన నిర్వహణా సామర్ధ్యం, వ్యూహాత్మక నిర్ణయాలతో గత ఆర్థిక సంవత్సరం మంచి పనితీరు సాధ్చమైందని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్ శంకర సుబ్రమణియన్ చెప్పారు.
కోరమాండల్ లాభం రూ.578 కోట్లు
