Hyderabad: నిందితులతో చేతులు కలిపి రూ.27 కోట్లు పక్కదారి పట్టించిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గచ్చిబౌలి శాఖకు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండూరు సంజయ్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 2009-13 మధ్యకాలంలో సంజయ్ బాలానగర్ ఎస్‌బీఐ చిన్నతరహా పరిశ్రమల శాఖలో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆదర్శ కమ్యునికేషన్స్ సంస్థ ఆస్తులు తనఖా పెట్టి రూ.27కోట్ల రుణం తీసుకుంది. రుణం మంజూరైన తర్వాత సంస్థ ఎండీ ఎం ఆంజనేయులు, రీటా 2013లో పరారయ్యారు. దీనిపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి సీఐడీకి బదిలీ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే అప్పటి ఆర్ఎంగా పనిచేసిన సంజయ్, కస్టమర్ సపోర్ట్ అధికారి రవీంద్రనాథ్ లతో కుమ్మక్కై ఈ మోసం జరిగిందని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రధాన నిందితులను 2024లో బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం ప్రస్తుతం ఏజీఎం పదవిలో ఉన్న సంజయ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఎస్‌బీఐకి రూ.27కోట్లు టోకరా.. హైదరాబాద్ ఏజీఎం అరెస్టు
