అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అరెస్టయ్యారు. విద్యార్థి వీసాపై యూఎస్‌కు వచ్చి.. వృద్ధులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు, మోసాలకు పాల్పడుతుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మహమ్మదిల్హమ్ వహోరా(24), హాజీ అలీ వహోరా(24)గా పోలీసులు గుర్తించారు. వీరు చికాగోలోని ఈస్ట్-వెస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. తనకు స్కామర్ల నుంచి ఫోన్ వచ్చిందని ఓ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తమను ప్రభుత్వ ఏజెంట్లుగా చెప్పుకొని ఓ కేసు విషయంలో డబ్బులు ఇవ్వాలని బెదిరించారని.. క్రిప్టో కరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి వారికి ఇచ్చానని తెలిపారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఇద్దరు భారతీయులను అరెస్టు చేశారు. గతంలోనూ వీరు చాలామంది వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల అరెస్టు
